CSK vs GT: చివరి రెండు బంతుల్లో 10 పరుగులు.. జడేజా చెన్నైని గెలిపించాడిలా..

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-16వ సీజన్‌ ఫైనల్‌ పోరు అసలుసిసలు టీ20 మజాను అందించింది. ఓవర్‌ ఓవర్‌కు మలుపులు తిరుగుతున్న వేళ.. క్రికెట్‌ అభిమానులు పసందైన వినోదాన్ని ఆస్వాదించారు. స్టేడియంతో పాటు టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను టైటిల్‌ పోరు మునివేళ్లపై నిలుచోబెట్టింది. చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్ జట్ల మధ్య ఉత్కంఠగా సాగిన పోరులో చివరకు చెన్నైదే పైచేయి అయింది. జడేజా అద్భుత బ్యాటింగ్‌తో ధోనీ సేన ఐదోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో జడేజా అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో స్టేడియం పసుపు రంగు జెర్సీలతో హోరెత్తింది. ఇంకెందుకు ఆలస్యం ఆ గెలుపు క్షణాలను మీరూ ఆస్వాదించండి.   

Published : 30 May 2023 02:20 IST

Tags :

మరిన్ని