Population: జనాభా తీవ్రంగా తగ్గిపోయే అవకాశం.. కలవరపెడుతున్న అంచనాలు!

భారత్‌.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. కానీ, రాబోయే రోజుల్లో జనాభా తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనాలు కడుతున్నారు.

Updated : 11 Jul 2024 15:46 IST

భారత్‌.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. గతేడాదే చైనాను దాటేసి ఈ ఘనతను సాధించింది. ఈ లెక్కన చూస్తే రానున్న రోజుల్లో మరింత ఎక్కువ జనాభా పెరిగే అవకాశం ఉంది. కానీ, ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల.. రాబోయే రోజుల్లో జనాభా తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంటుందనే అంచనాలు కడుతున్నారు. నేటి తరం యువత త్వరగా పెళ్లిళ్లు చేసుకోకపోవడం కూడా ఇలాంటి పరిణామాలకు ప్రధాన సమస్యగా మారనుందని విశ్లేషిస్తున్నారు. 25ఏళ్ల తర్వాత జనాభా తగ్గిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ ముప్పు కేవలం భారత్‌కేనా! ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకూడా ఉందా? జనాభా తగ్గిపోతే వచ్చే నష్టాలేంటి? జనాభాను పెంచుకోవడానికి చైనాఏం చేస్తోంది?

Tags :

మరిన్ని