Ap News: ట్రాఫిక్‌ రద్దీ.. స్వయంగా రంగంలోకి డీజీపీ

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా భారీ ట్రాఫిక్ జాం కావడంతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా రంగంలోకి దిగారు.

Published : 13 Jun 2024 12:53 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా భారీ ట్రాఫిక్ జాం కావడంతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డుపై నిలిచిన వాహనాలతో ఏర్పడ్డ ట్రాఫిక్ (Traffic) రద్దీని క్లియర్ చేశారు. తన భద్రత సిబ్బందితో కలిసి మండుటెండనూ లెక్కచేయకుండా.. ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేశారు. అధికారులు, కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ.. ట్రాఫిక్‌లో విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో దిగితే స్థాయితో సంబంధం లేదని డీజీపీ స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు