CM Chandrababu: చంద్రబాబు డీఎస్సీపై తొలి సంతకం పెట్టడంపై నిరుద్యోగుల హర్షం

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెట్టడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Published : 14 Jun 2024 09:35 IST

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెట్టడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ళుగా టీచర్‌ కొలువు కోసం తాము కంటున్న కలలను నిజం చేశారని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. థాంక్యూ సీఎం సార్‌ అంటూ పలుచోట్ల ఆయన చిత్రపటానికి పాలభిషేకం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడ్డారంటూ కొనియాడారు. 117 జీవో రద్దు చేసి ఎస్జీటీ పోస్టులు పెంచితే తమకు మరింత మేలు చేసిన వారవుతారని నిరుద్యోగులు కోరుతున్నారు.

Tags :

మరిన్ని