ఉత్కంఠగా నవీన్‌చంద్ర ‘లెవన్‌’ టీజర్‌

మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటించిన ‘లెవన్‌’ టీజర్‌ను హీరో నిఖిల్‌ విడుదల చేశారు.

Published : 19 Jun 2024 17:23 IST

నవీన్‌ చంద్ర, కీలక పాత్రలో నటించిన క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘లెవన్‌’ (Eleven Telugu Movie Teaser). లోకేశ్‌ అజ్లిస్‌ దర్శకుడు. రేయా హరి, శశాంక్‌, అభిరామి, దిలీపన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘రంజిత్‌లాంటి ప్రతిభ కలిగిన ఆఫీసర్‌ ఈ కేసును ఎందుకు ఛేదించలేకపోయాడో అర్థం కాలేదు. ఫింగర్‌ ప్రింట్స్‌ లేవు.. ఫుట్‌ ప్రింట్స్‌ లేవు.. కనీసం జుట్టు ఆనవాళ్లు కూడా లేవు’ అంటూ ఆసక్తికరంగా మొదలైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మరి హత్య కేసును పోలీస్‌ ఆఫీసర్‌ అయిన నవీన్‌ చంద్ర ఎలా ఛేదించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

మరిన్ని