Yeddyurappa: పోక్సో కేసుపై స్పందించిన మాజీ సీఎం యడియూరప్ప

మైనర్ పై లైంగిక వేధింపుల కింద తనపై నమోదైన ఫోక్సో కేసుపై కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు.

Published : 15 Jun 2024 23:40 IST

మైనర్ పై లైంగిక వేధింపుల కింద తనపై నమోదైన ఫోక్సో కేసుపై... కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. అనవసరమైన గందరగోళాన్ని సృష్టించేందుకే...... తనపై ఇలాంటి కేసులు నమోదు చేశారన్నారు. త్వరలోనే ఈ కేసులో నిజనిజాలు బయట పడతాయని యడియూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. దిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్న ఆయన ఈనెల 17న CID విచారణకు హాజరవుతానని ముందే చెప్పినట్లు గుర్తుచేశారు. దీనిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో తాను ఎవరిని తప్పుపట్టడం లేదన్న యడియూరప్ప కాలమే అన్నింటిని నిర్ణయింస్తుందన్నారు. ప్రజలకు సత్యం ఏమిటో తెలుస్తుందని తనపై కుట్రలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.17 ఏళ్ల తన కుమార్తెను లైంగికంగా వేధించారని ఆమె తల్లి యడియారప్పపై మార్చిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై పోక్సో కేసు సహా సెక్షన్ 354A కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

మరిన్ని