Seemantham: ఘనంగా గోమాతకు సీమంతం..ఎక్కడో తెలుసా!

ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు.

Published : 16 Jun 2024 12:40 IST

ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. గోమాతకు సీమంతం (Seemantham) చేసి భక్తిని చాటుకున్న ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో జరిగింది. రాజశేఖర్, సుధ అనే దంపతులు పుంగనూరు జాతి గోవుకు సీమంతం చేశారు. గోమాతకు పసుపు, కుంకుమ రాసి.. కొత్త వస్త్రాలు సమర్పించి.. గో ప్రదక్షిణలు చేశారు. సీమంతం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Tags :

మరిన్ని