Open Gyms: అధికారుల నిర్లక్ష్యంతో.. వృథాగా మారిన ఓపెన్‌ జిమ్‌లు!

ప్రస్తుత ఆహార అలవాట్లు లేదా పని ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరు ఉదయం లేదా సాయంత్రం వ్యాయమం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Published : 18 Jun 2024 13:15 IST

ప్రస్తుత ఆహార అలవాట్లు.. లేదా పని ఒత్తిడి కారణంగా.. ప్రతి ఒక్కరు ఉదయం లేదా సాయంత్రం వ్యాయమం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసింది. వ్యాయామంపై అవగాహన ఉన్న కొందరు మాత్రం వాటిని సరైన రీతాలో వినియోగిస్తుండగా.. మరికొందరు ఇష్టానుసారంగా వాడటంతో పరికరాలు విరిగిపోయాయి. అధికారులు బాగుచేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. ఓపెన్ జిమ్‌ల నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగా మారిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.      

Tags :

మరిన్ని