Pinnelli: ఈవీఎం నేను పగలగొట్టలేదు.. పోలీసుల విచారణలో పిన్నెల్లి

పాల్వాయిగేటుకు తాను వెళ్లనే లేదని, ఈవీఎంను పగులగొట్టలేదని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల విచారణలో చెప్పారు.

Published : 09 Jul 2024 09:27 IST

‘పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రానికి నేను వెళ్లలేదు. ఈవీఎంను పగలగొట్టలేదు. నంబూరి శేషగిరిరావు ఎవరో నాకు తెలియదు. ఆరోజు నా వెంట గన్‌మన్లు లేరు’... పోలీసుల విచారణలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాధానాలివి. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేసిన ఘటనపై కేసు నమోదైన సంగతి విదితమే.

Tags :

మరిన్ని