Italy: ఇటలీ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు..!

జీ-7 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ.. ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 15 Jun 2024 13:09 IST

జీ-7 శిఖరాగ్ర సదస్సు(G7 Summit) జరుగుతున్న వేళ.. ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే బిల్లు విషయంలో దిగువ సభలో.. అధికార, విపక్ష చట్టసభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప్రతిపక్ష నేతకు గాయలు కాగా.. ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడానికి అక్కడి అధికార పార్టీ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లు.. ఇటలీలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య విభజనను మరింత పెంచుతుందని విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చట్టసభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

Tags :

మరిన్ని