Kali Teaser: ‘కలి’ టీజర్‌ విడుదల చేసిన ‘కల్కి’ డైరెక్టర్‌.. ఈ కథేంటి?

ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘కలి’. ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 07 Jul 2024 17:07 IST

మహా భారతం గురించి చర్చించుకునేలా, తెలుసుకునేలా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా. అందులో ‘కల్కి’గా నటించేదెవరు? కలి ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ‘కల్కి’ పార్ట్‌ 2 కోసం వేచి చూడాల్సిందే. మరోవైపు, ‘కలి’ (Kali) టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో శివ సాషు తెరకెక్కిస్తున్నారు. ప్రచారంలో భాగంగా టీజర్‌ని ‘కల్కి’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. మంచితనంతో ఈ సమాజంలో బతకలేనంటూ శివరామ్‌ (ప్రిన్స్‌) ఆత్మహత్యకు యత్నిస్తాడు. అదే సమయంలో ఓ వ్యక్తి (నరేశ్‌) వచ్చి నిలువరిస్తాడు. హీరోతో పరిచయం లేకపోయినా తన గురించి అన్ని విషయాలు చెబుతుంటాడు. ఇంతకీ ఆ అపరిచితుడు ఎవరు? మంచితనం వల్ల శివరామ్‌ జీవితంలో ఏం జరిగింది? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు