SA vs WI: క్యాచ్‌ కోసం వెళ్లి.. ఒకరినొకరు ఢీకొని

దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పింది. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఒకరినొకరు ఢీకొని కిందిపడిపోయారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Published : 24 Jun 2024 11:45 IST

ఆంటిగ్వా: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) సెమీస్‌కు దక్షిణాఫ్రికా దూసుకుపోయింది. విండీస్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా సఫారీ జట్టు ఆటగాళ్లు మార్కో ఎన్‌సెన్, కగిసో రబాడ క్యాచ్‌ కోసం బౌండరీ లైన్‌ వద్ద ఢీకొని కిందపడిపోయారు. వెంటనే వైద్య బృందం వచ్చి ఇద్దరిని పరీక్షించింది. లక్ష్య ఛేదనలో వీరిద్దరూ కలిసి చివర్లో దక్షిణాఫ్రికాను గెలిపించడం విశేషం. ఐసీసీ ఈ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని