Fraud: ’ప్రీ లాంచ్‘ పేరుతో భారీ మోసం.. బాధితుల నుంచి రూ.కోట్లు వసూలు

హైదరాబాద్‌లో మరో స్థిరాస్తి సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. ‘ప్రీ లాంచ్’ పేరుతో బాధితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన వ్యవహారంపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated : 20 Jun 2024 14:39 IST

హైదరాబాద్‌లో మరో స్థిరాస్తి సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. ‘ప్రీ లాంచ్’ పేరుతో బాధితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన వ్యవహారంపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నగరంలో శివారుల్లో ‘ప్రీ లాంచ్’ పేరుతో వివిధ ప్రాంతాల్లో పలు పేర్లతో ప్రాజెక్టులను ప్రారంభించి మోసం చేశారని.. బాధితులు వాపోతున్నారు. కొల్లూరు, మోకిలా, అబ్దుల్లాపూర్ మెట్, యాదాద్రిలో భారీ వెంచర్లలో ఇళ్లు నిర్మిస్తామంటూ.. ప్రచారం చేసినట్టు చెబుతున్నారు. జీఎస్‌ఆర్‌ సంస్థ ఏండీ శ్రీనివాసరావు 2020 నుంచి నగదు వసూలు చేసినట్లు.. బాధితులు తెలిపారు. మూడేళ్లలో వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసి.. ఎలాంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆరోపిస్తున్నారు. తమ నగదు తిరిగి ఇవ్వాలని నెలల తరబడిగా వేడుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Tags :

మరిన్ని