హీరో విజయ్‌ దేవరకొండ ఆలోచన స్ఫూర్తిదాయకం: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

‘ఖుషి’ (Kushi) సక్సెస్‌ మీట్‌లో ఇచ్చిన మాట ప్రకారం వంద కుటుంబాలకు రూ.లక్ష రూపాయల చెక్‌ను హీరో విజయ్‌దేవరకొండ అందించిన విషయం తెలిసిందే. ఆయన అందించిన సాయం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెందిన షర్మిల శ్రీ అనే బాలికకు దక్కింది. ఆ బాలిక ప్రమాదవశాత్తూ ఆటో ప్రమాదంలో ఓ కాలును పోగొట్టుకుంది. తాజాగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆ బాలిక కుటుంబాన్ని కలిశారు. ఆ బాలికకు అందించిన సాయానికిగానూ విజయ్‌ దేవరకొండకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Updated : 03 Nov 2023 16:31 IST

Tags :

మరిన్ని