Ramcharan: అత్యంత ఖరీదైన కారులో అంబానీ పెళ్లికి రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ తన  కొత్త రోల్స్‌ రాయిస్‌ స్పెక్టార్‌ను డ్రైవ్‌ చేసుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వీడియో వైరల్‌ అవుతోంది.

Updated : 11 Jul 2024 16:44 IST

హైదరాబాద్‌: అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ దంపతులు కూడా ముంబయి బయలుదేరి వెళ్లారు.  అందులో విశేషం ఏముందనుకుంటున్నారా? హైదరాబాద్‌లోని  ఇంటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు సతీమణి ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి రామ్‌చరణ్‌ తన  కొత్త రోల్స్‌ రాయిస్‌ స్పెక్టార్‌ను డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చారు. దాదాపు రూ.7 కోట్లకు పైగా ఖరీదైన కారులో ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రెండోది కావడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

Tags :

మరిన్ని