AP News: మెగా డీఎస్సీపై విద్యార్థులు, నిరుద్యోగుల హర్షం.. ఎస్వీయూలో సంబరాలు

మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేయడంపై తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు.

Published : 14 Jun 2024 15:33 IST

మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేయడంపై తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను వంచించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటించడం సంతోషకరమన్నారు. వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట చంద్రబాబు చిత్రపటానికి నిరుద్యోగులు, విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు. 

Tags :

మరిన్ని