TTD: తితిదే ప్రక్షాళన ప్రారంభం

జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో...ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల వైకాపాకు వ్యాపార నిలయంగా TTD ధర్మకర్తల మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల పవిత్రతనే మంటగలిపారు.

Updated : 17 Jun 2024 23:17 IST

జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో...ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల....వైకాపాకు వ్యాపార నిలయంగా.. TTD ధర్మకర్తల మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల పవిత్రతనే మంటగలిపారు. ఈ నేపథ్యంలోనే కొండపై ప్రక్షాళన అనివార్యమైంది. తిరుమల వెంకన్ననను కులదైవంగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు ...కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశం ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేసేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి.. పూర్వ విధానాలను అమలు చేసి...ఆ వైకుంఠనాథున్ని సామాన్య భక్తులకు....చేరువ చేయాల్సిన అవసరం ఉంది. ఐదేళ్ల పాటు రాజు, బంటు సర్వం తానై తిరుమలను బ్రష్టుపట్టించిన అధికారిని విధుల నుంచి తప్పించడంతో మెుదలైన ప్రక్షాళన రాబోయే కాలంలో మరింతగా ఉండనుంది...? మరి, ఐదేళ్ల పాలనలో తిరుమలను ధ్వంసం చేస్తూ వైకాపా ప్రభుత్వం తీసుకొన్న ఆ నిర్ణయాలు ఏంటి...? కొత్త ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిన అంశాలేంటి...?

Tags :

మరిన్ని