TGRTC: ఆర్టీసీ బస్సుల్లో ఎంట్రీ ఎగ్జిట్‌లపై ఆంక్షలు

మహిళలు, పురుషులు ఒకే ద్వారం నుంచి బస్సులోకి ఎక్కడం, దిగడం వల్ల ఇటీవలకాలంలో చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

Updated : 20 Jun 2024 10:13 IST

స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత.... వారు భారీ సంఖ్యలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలు, పురుషులు ఒకే ద్వారం నుంచి బస్సులోకి ఎక్కడం, దిగడం వల్ల ఇటీవలకాలంలో చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బస్సు ముందు ద్వారం వద్ద మహిళల ఫోటో, వెనక ద్వారం వద్ద పురుషుల ఫోటో పెయింట్ వేశారు. ఎవరికి కేటాయించిన ద్వారం నుంచి వాళ్లే ఎక్కాలని సూచిస్తున్నారు. దీంతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోతుందని కండక్టర్లు అంటున్నారు.

Tags :

మరిన్ని