JC Prabhakar Reddy: పది రోజుల్లో న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి

బస్సుల కొనుగోలు విషయంలో వైకాపా ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated : 19 Jun 2024 15:23 IST

బస్సుల కొనుగోలు విషయంలో వైకాపా ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వంలో ఐపీఎస్‌ సీతారామాంజనేయులు, అప్పటి మంత్రి పేర్ని నాని, డీటీసీ శివరాం ప్రసాద్ ఆదేశాలతో వేధించారని ధ్వజమెత్తారు. పది రోజుల్లో అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్పీ కార్యాలయం, డీటీసీ ఆఫీస్ ముందు తాను, తన కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. 

Tags :

మరిన్ని