Pension: పింఛన్ల పెంపుపై సీఎం సంతకం.. వృద్ధుల హర్షం

ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లను రూ.4 వేలకు పెంచుతూ చంద్రబాబు సంతకం పెట్టారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్‌ భరోసా’ పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు.

Published : 14 Jun 2024 10:49 IST

ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లను రూ.4 వేలకు పెంచుతూ చంద్రబాబు సంతకం పెట్టారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్‌ భరోసా’ పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. పింఛనుదారులు ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి ఏప్రిల్‌ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జులై 1న పింఛను కింద వీరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్‌ నుంచి మూడు నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి) అందిస్తారు.పింఛను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వృద్ధులు హర్షం వక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని