TDP: పబ్లిసిటీ కోసమే ప్రచార రథానికి వైకాపా నిప్పు!: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమహేంద్రవరంలో వైకాపా ప్రచారం రథం దగ్దం కావడం.. ఎన్నికల తర్వాత కూడా రాజకీయ వేడి రగిలిస్తోంది.

Updated : 06 Jul 2024 16:07 IST

రాజమహేంద్రవరంలో వైకాపా ప్రచారం రథం దగ్దం కావడం.. ఎన్నికల తర్వాత కూడా రాజకీయ వేడి రగిలిస్తోంది. ప్రచార రథానికి భరతే నిప్పుపెట్టుకుని.. తమపై బురద జల్లుతున్నారని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. నటనలో ఆరితేరిన భరత్.. పబ్లిసిటీ కోసం చేసిన స్టంటే ప్రచార రథం దగ్ధమని ఎద్దేవా చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉపేక్షించబోమన్నారు. అధికారంలో ఉన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని.. నిందితులు ఎవరైనా వదలబోమని హెచ్చరించారు.

Tags :

మరిన్ని