parliament: తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

18వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. తమిళనాడు కృష్ణగిరి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకుని తెలుగులో ప్రమాణం చేశారు. 

Published : 25 Jun 2024 17:03 IST

18వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. కేంద్ర మాజీ మంత్రి, భాజపా నాయకుడు నారాయణ రాణే, ఎన్సీపీ-శరత్ చంద్రపవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే, శివసేన-శిందే వర్గానికి చెందిన శ్రీకాంత్ శిందేల చేత ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రమాణం చేయించారు. తమిళనాడు కృష్ణగిరి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకుని తెలుగులో ప్రమాణం చేశారు. గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన గోపీనాథ్ శాసనసభలో కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు. తెలుగులోనే గోపీనాథ్ ప్రశ్నలు అడగ్గా అప్పటి సీఎం జయలలిత తెలుగులోనే సమాధానాలు ఇచ్చేవారు.

Tags :

మరిన్ని