Assam Flood: అసోంలో భారీ వరదలు.. 36కు చేరిన మృతుల సంఖ్య

అసోంలో భారీ వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు.

Updated : 21 Jun 2024 20:35 IST

అసోంలో భారీ వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రానికి కొపిలీ, బరాక్, కుషియారా వంటి నదులు ప్రమాదకర స్థాయి మించి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. వరదల వల్ల 19 జిల్లాల్లో నివసిస్తున్న 4 లక్షల మంది పరిస్థితి దయనీయంగా మారినట్లు పేర్కొన్నాయి. ఈ విపత్తు ప్రభావం కరీంగంజ్ జిల్లాలో తీవ్రంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు.. అక్కడ 2.5 లక్షల మందిపై ప్రభావం పడినట్లు చెప్పారు. ఇప్పటివరకూ వరదల్లో, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 36కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు