Jaggaiahpet: అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో భారీ పెలుడు

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది.

Published : 08 Jul 2024 10:34 IST

ఎన్టీఆర్‌ జిల్లా బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాల మీదకు తెచ్చింది. నిర్వహణ లోపంలో అలసత్వం ఒక తప్పిదమైతే.. దుర్ఘటన జరిగిన తర్వాత క్షతగాత్రులను రక్షించడంలో చూపిన అమానవీయ వైఖరి మరింత దారుణం. బాధితులను రక్షించేందుకు వచ్చిన వారిని కంపెనీ నిర్వాహకులు అడ్డుకుని తాళాలు వేసి పరారయ్యారు. ట్యాంకు లీకవుతోందంటూ కార్మికులు పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఫలితంగా దుర్ఘటన జరిగి ఒకరు మృతి చెందడమే కాకుండా, పలువురు కార్మికులు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. 

Tags :

మరిన్ని