Narayana: రాబోయే 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం!: మంత్రి నారాయణ

రాబోయే 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక నేతలు, రాజధాని ఐకాస సభ్యులు పువ్వాడ సుధాకర్‌తో సమావేశమయ్యారు.

Published : 16 Jun 2024 17:01 IST

రాబోయే 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక నేతలు, రాజధాని ఐకాస సభ్యులు పువ్వాడ సుధాకర్‌తో సమావేశమయ్యారు. రాజధానిలో గడిచిన ఐదేళ్లుగా కొంతమంది వ్యక్తులు ఇష్టానుసారంగా దోపిడీలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. దీనిపై ఒక కమిటీని నియమిస్తామన్నారు. ఎంత మేర నష్టం వాటిల్లిందనే అంశంపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఆహార సరఫరాపై టెండర్లు పిలిచి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Tags :

మరిన్ని