వికారాబాద్‌లోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 45 మంది విద్యార్థులకు అస్వస్థత

వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Published : 06 Jul 2024 13:35 IST

వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో మొత్తం 560 మంది ఉండగా గురువారం రాత్రి 40 మంది విద్యార్థులకు విపరీతంగా విరేచనాలు కావడంతో.. వారిని వెంటనే వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం వరకు కొంతమంది విద్యార్థులు కోలుకోగా మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో ఉన్న పరిసరాలు, ఆహారం, తాగునీరు బాగులేనందునే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే స్పందించిన వైద్యాధికారులు హాస్టల్లోనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 60 మంది విద్యార్థుల నుంచి రక్త నమూనాలు స్వీకరించామని.. గురువారం వండిన ఆహార పదార్థాలను పరీక్షలకు పంపించామని వాటి వివరాలు రాగానే ఏం జరిగిందనే విషయం తెలుస్తుందని వైద్య అధికారులు తెలిపారు.  

Tags :

మరిన్ని