YS Jagan: జగన్ రక్షణ కోసం 986 మంది సిబ్బంది

మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ భద్రతలో నిరంతరం ఎంతమంది పోలీసులు ఉంటారో తెలుసా? పదీ, ఇరవై కాదు.. ఏకంగా 986 సిబ్బంది.

Published : 25 Jun 2024 09:34 IST

అనగనగా ఓ పెద్ద ప్యాలెస్ దాని చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కంచె. బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్యూయిజర్ కార్లు.. రక్షణ కోసం 10 కాదు 20 కాదు ఏకంగా 986 మంది సిబ్బంది. ఇది పురాతన కాలంలోని ఏ రాజవంశీయులకు చెందిన కథ కాదు. తాను పేదనంటూ.. అనునిత్యం బీద అరుపులు అరిచే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘భద్రతా కథా చిత్రమ్’. రాచరిక పోకడలను అనుసరిస్తూ జగన్‌పైనే కాదు కుటుంబసభ్యులపై కూడా ఈగ వాలకుండా తెచ్చుకున్న చిత్రవిచిత్రమైన ‘ప్రత్యేక రక్షణ చట్టం’ గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

Tags :

మరిన్ని