DWCRA: డ్వాక్రాల అభయహస్తం నిధులు రూ.2,100 కోట్లు దారి మళ్లింపు

ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి, రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధులనూ వైకాపా ప్రభుత్వం వదల్లేదు. 2021లో ఎల్‌ఐసీ వద్ద ఉన్న రూ.2,100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీనే.

Published : 17 Jun 2024 09:34 IST

ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి, రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధులనూ వైకాపా ప్రభుత్వం వదల్లేదు. 2021లో ఎల్‌ఐసీ వద్ద ఉన్న రూ.2,100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీనే. ఇదే కాదు.. డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు రుణాలిస్తామని చెప్పి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో తెచ్చిన రూ.1000 కోట్ల స్త్రీనిధి లెక్క కూడా తేలలేదు. ఈ రెండు వ్యవహారాల్లో అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) సీఈఓ ఇంతియాజ్‌ కీలకంగా వ్యవహరించారు. ఆయన కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.

Tags :

మరిన్ని