Siddharth: నా మాటలను అపార్థం చేసుకున్నారు: క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్‌

సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని యువ కథానాయకుడు సిద్ధార్థ్ (Siddharth) స్పష్టం చేశారు.

Published : 09 Jul 2024 18:05 IST

సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని యువ కథానాయకుడు సిద్ధార్థ్ (Siddharth) స్పష్టం చేశారు. ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సిద్ధార్థ్.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు సామాజిక బాధ్యత ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పకముందే గతంలో తాను కండోమ్ ప్రకటనలో నటించి సామాజిక బాధ్యత చాటుకున్నానని వివరించారు. అయితే తన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి తన పూర్తి మద్దతు ఉంటందని తెలిపారు.

Tags :

మరిన్ని