Raj Tarun: రాజ్ తరుణ్ కేసులో మాపై లావణ్య ఆరోపణలు అవాస్తవాలు: సినీనటి మాల్వీ మల్హోత్రా

సినీ నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. లావణ్యను తన సోదరుడు బెదిరించలేదని వెల్లడించారు.

Published : 06 Jul 2024 22:27 IST

సినీ నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. లావణ్యను తన సోదరుడు బెదిరించలేదని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులకు లావణ్య ఎవరో కూడా తెలియదని.. ఆమెను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న లావణ్యపై సైబరాబాద్‌లోని మహిళా పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుటుంబం హిమాచల్‌ప్రదేశ్‌లో నివసిస్తోందని చెప్పారు. ఒకసారి షూటింగ్ సందర్భంగా తన కుటుంబ సభ్యులను రాజ్ తరుణ్ కలిశాడని ఆమె వెల్లడించారు. లావణ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వివరించారు. రాజ్ తరుణ్ తన సహనటుడు మాత్రమేనని, కలిసి పనిచేశామని స్పష్టం చేశారు. తాము సినిమాలు, షూటింగ్ గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్లమని తెలిపారు. లావణ్యే తన కుటుంబ సభ్యులను బెదిరిస్తోందని, ఆమె ఇలా ఎందుకు చేస్తోందో అర్థం కావడంలేదని వాపోయారు.

Tags :

మరిన్ని