Amaravati: అమరావతి రైతుల కీలక నిర్ణయం.. దీక్షా శిబిరాల ఎత్తివేత

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో సంతోషం వ్యక్తం చేసిన అమరావతి రైతులు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించాలంటూ 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపిన రైతులు.. ఇప్పుడు వాటిని మూసేయాలని నిర్ణయించారు.

Published : 12 Jun 2024 20:24 IST

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో సంతోషం వ్యక్తం చేసిన అమరావతి రైతులు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగించాలంటూ 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపిన రైతులు.. ఇప్పుడు వాటిని మూసేయాలని నిర్ణయించారు. కరోనా తర్వాత ప్రధానంగా వెలగపూడి, మందడం, తుళ్లూరు శిబిరాల నుంచే కార్యకాలాపాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో బుధవారం వెలగపూడిలోని దీక్షా శిబిరాలను తొలగించారు. తుళ్లూరులో రైతులు, మహిళలు పాదయాత్రలో వినియోగించిన రథంతో విజయ యాత్ర నిర్వహించారు. శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహంతో తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు విజయం సాధించిన వెంటనే అమరావతిలో ఆగిపోయిన పనులు వేగవంతంగా సాగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని