CM Chandrababu: ఏపీ అభివృద్ధిపై సంక్షేమ సంతకం.. సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.

Published : 13 Jun 2024 17:28 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు.

Tags :

మరిన్ని