AP News: రవాణాశాఖ సేవలన్నీ ఒకే వెబ్‌సైట్‌లో.. త్వరలో అందుబాటులోకి ‘వాహన్‌’

ఆంధ్రప్రదేశ్‌లో రవాణాశాఖ సేవలన్నీ త్వరలో ఒకే వెబ్‌సైట్ కిందకు రానున్నాయి.

Published : 10 Jul 2024 14:04 IST

ఆంధ్రప్రదేశ్‌లో రవాణాశాఖ సేవలన్నీ త్వరలో ఒకే వెబ్‌సైట్ కిందకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ వెబ్‌సైట్‌ను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని వెబ్‌సైట్ నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి సరిచేస్తున్నారు. ఈ విధానం విజయవంతమైతే రవాణాశాఖ అమలుచేస్తున్న ఈ-ప్రగతి సైట్‌ను పూర్తిస్థాయిలో నిలిపేసి రాష్ట్రవ్యాప్తంగా ‘వాహన్’ ద్వారా మాత్రమే వాహనదారులకు సేవలందించనున్నారు.

Tags :

మరిన్ని