Vangalapudi Anitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి అనిత, తెదేపా ఎమ్మెల్యేలు

తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత, తెదేపా ఎమ్మెల్యేలు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు.

Published : 23 Jun 2024 15:20 IST

తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత, తెదేపా ఎమ్మెల్యేలు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. మంత్రి అనిత కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల వారు మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని