Vangalapudi Anitha: మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడికి తగిన శిక్ష పడేలా చూస్తాం: హోం శాఖ మంత్రి అనిత

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఓ మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని పట్టుకొని తగిన శిక్ష పడేలా చూస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Published : 07 Jul 2024 15:32 IST

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఓ మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని పట్టుకొని తగిన శిక్ష పడేలా చూస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇంట్లో ఉన్న తొమ్మిదేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్నాడు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని జిల్లా పోలీసులను ఆదేశించినట్లు మంత్రి అనిత తెలిపారు. సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ తనను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు ఆమె వివరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా అవసరమైన సాయాన్ని అందిస్తామని అనిత హామీ ఇచ్చారు.

Tags :

మరిన్ని