Nimmala RamaNaidu: టిడ్కో ఇళ్ల వద్ద మంత్రి నిమ్మల శ్రమదానం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల సముదాయ కాలనీలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెదేపా శ్రేణులతో కలిసి శ్రమదానం చేశారు. ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా కాలనీలో అడవిలా పెరిగిన చెట్లు, మట్టి గుట్టలను తొలగించారు.

Published : 07 Jul 2024 20:02 IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల సముదాయ కాలనీలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెదేపా శ్రేణులతో కలిసి శ్రమదానం చేశారు. ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా కాలనీలో అడవిలా పెరిగిన చెట్లు, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పార, పలుగు పట్టి పనులు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో తెదేపా ప్రభుత్వంలో గృహాలను 90 శాతం పూర్తి చేస్తే.. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో అరబస్తా సిమెంటు, రూపాయి పని చేయలేదన్నారు. 

Tags :

మరిన్ని