Ramoji Rao: రామోజీరావుకు వైఎస్‌ షర్మిల నివాళులు

అక్షర యోధుడు దివంగత రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు.

Published : 19 Jun 2024 19:16 IST

అక్షర యోధుడు దివంగత రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. రామోజీరావు నివాసానికి వెళ్లిన షర్మిల.. ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీరావు అస్తమయం పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

మరిన్ని