YS Sharmila: నీట్‌ పేపర్‌ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : వైఎస్‌ షర్మిల

డాక్టర్లు అవుదామని ఆశపడిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

Published : 21 Jun 2024 20:05 IST

డాక్టర్లు అవుదామని ఆశపడిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా నీట్‌ పేపర్‌ లీక్‌ స్కామ్‌ జరిగిందనే ఆధారాలు బయటపడ్డాయన్నారు. నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ పిలుపుమేరకు విజయవాడలోని లెనిన్‌ కూడలిలో షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు. పరీక్షకు ఆలస్యంగా వస్తే గ్రేస్‌ మార్కులు ఎలా ఇస్తారు? రెండు నిమిషాలు అదనపు సమయం ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. అవకతవకలు జరిగినా ఎన్టీయే మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Tags :

మరిన్ని