Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన వైకాపా బాధితురాలు ఆరుద్ర

కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెంనకు చెందిన వైకాపా బాధితురాలు ఆరుద్ర.. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

Published : 14 Jun 2024 20:32 IST

కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెంనకు చెందిన వైకాపా బాధితురాలు ఆరుద్ర.. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వైకాపా హయాంలో తాను, తన కుమార్తె ఎదుర్కొన్న కష్టాలను సీఎంకు ఆరుద్ర వివరించారు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు రూ.10వేల పింఛను మంజూరు చేస్తామని, వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.  

Tags :

మరిన్ని