Aswaraopet: ఎస్సై శ్రీను ఆత్మహత్య కేసులో నా భర్తపై ఆరోపణలు బాధాకరం: సీఐ భార్య

తెలంగాణవ్యాప్తంగా సంచనలం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాములు ఆత్మహత్య ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ అంశంపై సీఐ భార్య శైలజ ఓ వీడియోను విడుదల చేశారు.

Updated : 07 Jul 2024 17:38 IST

తెలంగాణవ్యాప్తంగా సంచనలం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాములు ఆత్మహత్య ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఎస్సై ఆత్మహత్యకు, అశ్వరావుపేట సీఐ జితేందర్ రెడ్డితో పాటు నలుగురు కానిస్టేబుళ్లు కులం పేరుతో దూషించడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఈ అంశంపై సీఐ భార్య శైలజ ఓ వీడియోను విడుదల చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను సీఐ జితేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నట్లు ఆమె వివరించారు. అటువంటి తన భర్త.. ఎస్సై శ్రీరాములును కులం పేరుతో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు దీన్ని గమనించి పారదర్శకంగా విచారణ చేయాలని కోరారు.

Tags :

మరిన్ని