Viral Video: సబ్బుపై కాలు వేసి.. భవనంపై నుంచి జారిపడ్డ మహిళ!.. వీడియో వైరల్‌

సబ్బు ముక్కపై కాలు వేయడంతో ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి మహిళ జారిపడి తీవ్రంగా గాయపడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

Published : 22 Jun 2024 22:32 IST

సబ్బు ముక్కపై కాలు వేయడంతో ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి మహిళ జారిపడి తీవ్రంగా గాయపడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రుబయి అనే ఆ మహిళ కిందకు జారి వేలాడుతున్న సమయంలో.. భర్త ఆమె చేయిని గట్టిగా పట్టుకుని రక్షించే ప్రయత్నం చేశారు. డీజేహల్లి ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బంధించారు. ప్రమాదానికి ముందు రుబయి తన భర్తతో కలిసి రెండో అంతస్తుపై ఉన్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఓ సబ్బు ముక్కపై కాలు వేయడంతో జారి భవనంపై నుంచి కిందపడబోయారు. వెంటనే ఆమె చేతిని భర్త గట్టిగా పట్టుకున్నాడు. కొంతసేపు అలా వేలాడిన తర్వాత భర్త పట్టు సడలడంతో ఆమె కింద పడింది. కింద ఉన్న జనం వస్త్రాన్ని పరిచి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు