Srinivas Varma: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తాం: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Published : 18 Jun 2024 13:51 IST

నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రిగా ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సోమువీర్రాజు సహా పలువురు భాజపా నేతలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసవర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తానని శ్రీనివాసవర్మ అన్నారు. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ ప్రజల సెంటిమెంట్‌ను కాపాడుతూ ముందుకువెళ్తామన్నారు. 

Tags :

మరిన్ని