Hyderabad: వారాంతాల్లో రెచ్చిపోతున్న యువత.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌ రేసింగ్‌..

వారాంతపు సెలవులు వస్తే చాలు అర్ధరాత్రి భాగ్యనగరంలో యువత రెచ్చిపోతున్నారు.

Published : 23 Jun 2024 11:12 IST

వారాంతపు సెలవులు వస్తే చాలు అర్ధరాత్రి భాగ్యనగరంలో యువత రెచ్చిపోతున్నారు. లాంగ్ డ్రైవ్స్, నైట్ రైడ్స్ అంటూ రోడ్లపై కొంతమంది యువకులు నానా హంగామా చేస్తున్నారు. హైదరాబాద్‌లో రాత్రిపూట బైక్ రేసింగ్‌లు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై స్టంట్లు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీహబ్ ప్రాంతంలో బైక్ రేసింగ్ జరిగింది. వాహనాల రాకపోకల మధ్య బైకులపై స్టంట్లు చేస్తూ.. యువకులు హంగామా సృష్టించారు. 

Tags :

మరిన్ని