Nallamilli Ramakrishna Reddy: కాంగ్రెస్‌లో వైకాపా విలీనం.. డీకే శివకుమార్‌తో జగన్‌ చర్చలు: ఎమ్మెల్యే నల్లమిల్లి

వైకాపా హయాంలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందని భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Published : 25 Jun 2024 15:04 IST

వైకాపా హయాంలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందని భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. అందుకే ఎన్డీయే కూటమికి ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారని చెప్పారు. నియంత పరిపాలనను ప్రజలు ఆమోదించరనే విషయం స్పష్టమైందన్నారు. అందుకే దిక్కులేని స్థితిలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో జగన్‌ చర్చలు జరిపారన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు