Purandeswari: మోరంపూడి పైవంతెనకు శిలాఫలకం తెదేపా హయాంలోనే పడింది: ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరంలోని మోరంపూడి ఫ్లైఓవర్‌ను ఆగస్టు 15న ప్రారంభిస్తామని ఎంపీ పురందేశ్వరి తెలిపారు.

Published : 10 Jul 2024 15:56 IST

  రాజమహేంద్రవరంలోని మోరంపూడి ఫ్లైఓవర్‌ను ఆగస్టు 15న ప్రారంభిస్తామని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసు, మాజీ ఎంపీ మురళీమోహన్‌తో కలిసి పైవంతెన నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. జాతీయ రహదారిపై NHAI చేపట్టిన వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా వైకాపా తన రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేసిందన్నారు. మోరంపూడి పైవంతెనను తాను ఎంపీగా ఉన్నప్పుడే సాధించామని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ చెప్పడం హాస్యాస్పదమని నేతలు అన్నారు. పైవంతెనకు శిలాఫలకం తెదేపా హయాంలోనే పడిందన్నారు.  

Tags :

మరిన్ని