AP News: తెదేపాపై అభిమానం.. కృష్ణానదిలో పడవలతో యజమానుల ర్యాలీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెదేపా అధినేత చంద్రబాబుకు అమరావతిలోని ఇసుక పడవల యజమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

Published : 12 Jun 2024 12:26 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెదేపా అధినేత చంద్రబాబుకు అమరావతిలోని ఇసుక పడవల యజమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా నదిలో సుమారు 30 పడవలతో తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీ నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. పడవలకు పార్టీ జెండాలను కట్టి జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో సందడి చేశారు. తమకు మళ్లీ ఉపాధి లభిస్తోందన్న సంతోషంతో ర్యాలీ చేసినట్లు పడవల సంఘం నాయకుడు దేవినేని సదాశివరావు చెప్పారు.  

Tags :

మరిన్ని