Viral Video: యువకుల షార్ట్స్ పిచ్చి.. సముద్రంలో చిక్కుకున్న వాహనాలు

యువతకు షార్ట్ వీడియోల పిచ్చి రోజురోజుకీ ముదురుతోంది. గుజరాత్ కచ్‌లోని రాంద్ బందర్ తీరంలో కొందరు యువకులు థార్ వాహనాలను సముద్రం లోపలికి తీసుకెళ్లారు.  ఈ క్రమంలో ఆ వాహనాలు రెండూ నీటిలో చిక్కుకుపోయాయి.

Published : 24 Jun 2024 18:53 IST

యువతకు షార్ట్ వీడియోల పిచ్చి రోజురోజుకీ ముదురుతోంది. గుజరాత్ కచ్‌లోని రాంద్ బందర్ తీరంలో కొందరు యువకులు థార్ వాహనాలను సముద్రం లోపలికి తీసుకెళ్లారు. మొత్తం 2 థార్‌లను నిర్దేశించిన దానికన్నా ఎక్కువ లోతుకు తీసుకెళ్లి స్టంట్లు చేశారు. ఈ క్రమంలో ఆ వాహనాలు రెండూ నీటిలో చిక్కుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా అవి రాకపోవడంతో స్థానికులు ట్రాక్టర్ల సాయంతో వాటిని బయటకు లాగాల్సి వచ్చింది. ఒక వాహనం ఇంజిన్ పూర్తిగా పనికి రాకుండా పోయిందని తెలిసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆకతాయిలను అరెస్టు చేశారు. కార్ల యజమానులపై కేసు నమోదు చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు