Hyderabad: నీట్‌ అవకతవకలపై విద్యార్థి సంఘాల నిరసన ర్యాలీ

నీట్ అవకతవకలకు నిరసనగా ఎన్‌ఎస్‌యూఐ, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు హైదరాబాద్‌లో ‘స్టూడెంట్ మార్చ్’ను నిర్వహించాయి.

Updated : 18 Jun 2024 15:24 IST

నీట్ అవకతవకలకు నిరసనగా ఎన్‌ఎస్‌యూఐ, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు హైదరాబాద్‌లో ‘స్టూడెంట్ మార్చ్’ను నిర్వహించాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని.. నారాయణగూడ వైఎంసీఏ నుంచి హిమాయత్ నగర్ మీదుగా.. ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. నీట్ అవకతవకలపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి.. దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Tags :

మరిన్ని