TG News: చెంచు మహిళపై పాశవిక దాడి.. పరామర్శించిన మంత్రి జూపల్లి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మెులచింతలపల్లిలో ఇటీవల ఓ చెంచు మహిళపై పాశవికంగా కొందరు దాడి చేశారు.

Published : 22 Jun 2024 13:12 IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మెులచింతలపల్లిలో ఇటీవల ఓ చెంచు మహిళపై పాశవికంగా కొందరు దాడి చేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో స్వచ్చంధ సంస్థల దృష్టికి చేరింది. వారి ప్రమేయంతో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. కానీ.. ఈ విషయంలో కీలక వ్యక్తులను వదిలేశారని స్థానిక చెంచులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని పౌరసంఘాల నేతలు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న అబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

మరిన్ని