Free Sand Policy: ఏపీలో ఉచిత ఇసుక పాలసీ అమలుపై భవన నిర్మాణ కార్మికుల హర్షం

ఏపీవ్యాప్తంగా సోమవారం నుంచి అమలవుతున్న నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగ ప్రతినిధులు, కూటమి శ్రేణులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published : 09 Jul 2024 20:29 IST

ఏపీవ్యాప్తంగా సోమవారం నుంచి అమలవుతున్న నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగ ప్రతినిధులు, కూటమి శ్రేణులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిందని కూటమి నేతలు, కార్మికులు ఆరోపించారు. నూతన ఇసుక విధానంతో కార్మికులు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని